మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (13:48 IST)

ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఏంటది?

singam dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడుతాడని సీఎస్కే ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ ఆడతాడని తెలియడంతో మహీ ఫ్యాన్స్, సీఎస్కే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
అంతేగాకుండా వచ్చే సీజన్ కచ్చితంగా ఆడతానని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం అంతగా నచ్చడం లేదని ధోనీ పేర్కొన్నాడు.
 
గత ఏడాది ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ ఏడాది వరుస ఓటములతో అంతగా రాణించలేకపోయింది. రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ధోనీ జట్టులో నూతనోత్సాహాన్ని నింపాడు. ఓడినా తాము మెరుగైన ప్రదర్శన చేశామని ఎంఎస్ ధోనీ గుర్తుచేశాడు. 
 
వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే చెన్నై వేదికగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు ధోనీ. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్‌గా బరిలోకి దిగుతామని.. సీఎస్కే వేదికగా మ్యాచ్‌లు జరగకపోవడం చెన్నై అభిమానులను నిరాశకు గురిచేసిందని కామెంట్స్ చేశాడు.