గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (08:58 IST)

ప్రపంచ బాక్సింగ్ వేదికపై మెరిసిన తెలుగు తేజం జరీన్

zareen nikhit
ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగు అమ్మాయి బంగారంతో మెరిసింది. హైదరాబాద్ నగరానికి చెందిన యువ బాక్సర్ నిఖిత్ జరీన్ బంగారు పతకాన్ని సాధించింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ విజయం సాధించింది. థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖిత్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. 
 
ఈ పోటీల్లో భాగంగా 52 కేజీల విభాగంలో సత్తా చాటుతూ సాగిన నిఖిత్ తన జోరును ఆఖరి మ్యాచ్‌లో కూడా కొనసాగించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో జిట్ పాంగ్‌పై పంచల వర్షం కురిపంచి, ఆఖరి పంచ్ కూడా తనదేనన్నట్టుగా రింగ్‌లో చెలరేగిపోయింది. దీంతో జిట్ పాంగ్‌ను ఏకంగా 5-0 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపొందడంతో నిఖత్ స్వర్ణ పతకాన్ని సాధించిన 52 కిలోల విభాగంలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా చరిత్ర సృష్టించింది.