సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 మే 2022 (18:01 IST)

ప్ర‌భాస్ సినిమా గురించి నాగ్ అశ్విన్ తాజా న్యూస్

Prabhas working still
Prabhas working still
నిన్న‌నే ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అనే సినిమా టైటిల్‌ను ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ వ‌చ్చే నెల‌నుంచి బిజీగా వుంటాన‌ని ఓ సంద‌ర్భంగా చెప్పారు. ఈరోజు దాన్ని ఖ‌రారుచేస్తూ సోష‌ల్‌మీడియాలో ఓ న్యూస్ పోస్ట్ చేశాడు. ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ చేస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ సినిమా ఇటీవ‌లే కొంచెం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రిగింది. ఆ షెడ్యూల్‌లో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దీపికా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. దిశాప‌టానీ కూడా పాల్గొన‌నున్న‌ద‌ని వార్త‌లు వ‌చ్చాయి. నాగ్ అశ్విన్ క్లారిటీ ఇస్తూ, ప్రభాస్ ప‌రిచ‌యం సన్నివేశంతో కూడిన కీల‌క షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. తదుపరి షెడ్యూల్ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని వెల్ల‌డించారు.
 
ఈ సినిమా వైజయంతీ మూవీస్ బేన‌ర్‌పై రూపొందుతోంది.   మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. డాని శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్  కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.