గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (22:50 IST)

కేజీఎఫ్-3కి అంతా రెడీ.. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి!

KGF-3
KGF-3
కేజీఎఫ్-3కి రంగం సిద్ధం అవుతోంది.  ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని టాక్ వస్తోంది. ఒక వైపున 'సలార్' సెట్స్ పైనే ఉంది. మరోవైపున ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు.

ఈ మధ్యలోనే ఈ 'కేజీఎఫ్ 3' ప్రాజెక్టును మొదలెట్టాలనుకుంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన "కేజీఎఫ్" సినిమా భారీ విజయాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే. 
 
చాలా కాలం తరువాత వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి ' కేజీఎఫ్- 2' పేరుతో ఇటీవల సీక్వెల్ ను వదిలారు. ఇది బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించింది. 
 
తొలి రోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఆ తరువాత వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడానికి ఈ సినిమా ఎక్కువ సమయం తీసుకోలేదు.

ఇక బాలీవుడ్‌లోను ఈ సినిమా వసూళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. అలాంటి కేజీఎఫ్ 2కి సీక్వెల్ రాబోతోందని ఇప్పటికీ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలియడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.