గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 మే 2022 (16:46 IST)

యోగా భంగిమ‌లు చూపిస్తున్న దీపికా ప‌దుకొనె

Deepika Padukone
Deepika Padukone
బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనె ఇప్పుడు బిజీ న‌టిగా మారిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ సినిమా ప్రాజెక్ట్‌కెలో న‌టిస్తోంది. ఇందులో దిశాప‌టానికూడా న‌టిస్తోంది. తాజాగా ఆమె ప‌టాస్‌, ఫైట‌ర్ వంటి చిత్రాల్లో బిజీగా వుంది. 2017 నుంచి కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఆమె రెడ్ కార్పెట్‌పై సంద‌డి చేస్తోంది. ఫ్రాన్స్‌లో జ‌రుగుతున్న ఈసారి వేడుక‌కు ఆమె ఇప్ప‌టికే అక్క‌డికి చేరుకుంది.
 
Deepika Padukone
Deepika Padukone
బాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకునే న‌టిగా పేరుపొందిన ఈమె ర‌ణ‌వీర్ ప్రియురాలు. అయితే రోజువారీ తాను యోగా చేస్తానంటూ సోష‌ల్‌మీడియాలో పేర్కొంది. అందుకు సంబంధించిన యోగా భంగిమ‌లను చూపిస్తూ పోస్ట్ చేసింది. యోగా శ‌రీరాన్ని అందంగా మారుస్తుందంటూ చెప్పింది. ఈ యోగా భంగిమ‌లు చూసి నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. శ‌రీరాన్ని ఎంత‌లా మౌల్డ్ చేశావో అంటూ దిపీకాను ప్ర‌శంసిస్తూ ర‌చ్చ చేస్తున్నారు.