బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మే 2022 (18:50 IST)

నవ్వితే చాలు.. అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు..

ఫైనాన్షియల్‌ సర్వీస్‌ దిగ్గజం మాస్టర్‌ కార్డ్‌ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్‌ కార్డ్‌ వినియోగదారులు పేమెంట్‌ చేసేందుకు బయోమెట్రిక్‌ తంబ్‌ లేదంటే నవ్వితే చాలు కార్డ్‌, స్మార్ట్‌ ఫోన్‌, టెలిఫోన్‌తో అవసరం లేకుండా మరో అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్‌ ఫర్‌ చేయొచ్చు. 
 
ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్‌ను బ్రెజిల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 
 
ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్‌ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్‌గా మరింత ఫాస్ట్‌గా డబ్బుల్ని మాస్టర్‌ కార్డ్‌ తెలిపింది. అయితే మాస్టర్‌ కార్డ్‌ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సౌకర్యం ఇప్పటికే వీసా, అమెజాన్‌లు అభివృద్ధి చేశాయని తెలిపింది. 
 
నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్‌ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్లు మాస్టర్‌ కార్డ్‌ సైబర్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ భల్లా తెలిపారు.