గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (19:43 IST)

పర్పుల్ కలర్ చీరలో మెరిసిన జబర్దస్త్ పూర్ణ

poorna
poorna
జబర్దస్త్ పూర్ణ చీరలో మెరిసింది. పర్పుల్ కలర్ పట్టుశారీలో పూర్ణ మహారాణిలా కనిపిస్తోంది. కాస్ల్టీ జ్యూవెల్లరీ ధరించి.. బంగారు బొమ్మలా ఆకర్షిస్తోంది. నల్లని కురులకు తెల్లని మల్లెపూలు చుట్టుకొని నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.  
  
చీరకట్టులో చాలా చాలా అందంగా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఇలా చేస్తే కుర్రకారు తట్టుకోవడం కష్టమంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పూర్ణ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
 
పూర్ణ ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. రీసెంట్‌గా పూర్ణ బాలయ్య అఖండలో మెరిసిన సంగతి తెలిసిందే. పూర్ణ అల్లరి నరేష్ హిరోగా వచ్చిన "సీమ టపాకాయ్" సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా పాపులర్ అయ్యారు.
 
'బ్యాక్ డోర్, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ' అనే సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు ప్రస్తుతం రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు తమిళంలోనూ మరో నాలుగైదు చిత్రాల్లో నటించగా.. అవి రిలీజ్ కావాల్సి ఉంది.