శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (19:38 IST)

మన్మధుడు హీరోయిన్ ఇప్పుడెలా వుందో తెలుసా?

Anshu ambani
Anshu ambani
సీనియర్ హీరోయిన్ అన్షు అంబానీ.. అదేనండి.. మన్మథుడు హీరోయిన్. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరం అయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా వుంటోంది. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన మన్మధుడు సినిమాలో హీరోయిన్‏గా నటించింది. 
 
ఈ మూవీలో ఎంతో అమాయకంగా.. సంప్రదాయబద్దంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. 
 
ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించి రాఘవేంద్ర సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ అన్షు సగం మూవీ మాత్రమే ఉంటుంది. 
 
ఈ చిత్రాల తర్వాత అన్షు నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 
 
తెలుగులోనే కాకుండా.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత లండన్‏కు చెందిన వ్యాపారవేత్త సచిన్‏ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఈమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.