సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (12:44 IST)

పొట్టి నరేష్ నా లవర్ అంటోన్న పూర్ణ

Poorna_Naresh
Poorna_Naresh
తెలుగులో జబర్దస్త్ షో క్లిక్ అయిన అంత బాగా మరే రియాలిటీ షో క్లిక్ కాలేదు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు వచ్చి కొంత మంది సినిమా ఆఫర్లు దక్కించుకుని బయటికి వెళ్లారు. మరి కొంతమంది జబర్దస్త్ తమ ప్రపంచం అన్నట్లు ఇక్కడే స్కిట్స్ చేసుకుంటూ ఉంటారు. 
 
అలాంటి వారిలో పొట్టి నరేష్ ఒకరు. అయితే ఆయన తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
 
ప్రస్తుతం జబర్దస్త్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కమెడియన్లలో ఒకరిగా నరేష్ యాంకర్ రష్మీ, రోజా వెళ్లిపోవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఖాళీగా ఉన్న ప్లేస్ లోకి వచ్చిన పూర్ణ, మరో జడ్జ్ ఇంద్రజ అందరికీ షాకిచ్చాడు. అదేమిటంటే సాధారణంగా నరేష్‌కు లవర్ ఉంది అంటే ఎవరూ నమ్మరు. 
 
అయితే జబర్దస్త్ షో లోనే ఒక అమ్మాయిని పడేసి నరేష్ షాక్ ఇచ్చాడు. అంతేకాక దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చూపించడంతో షో లో ఉన్న వారందరూ షాక్ అయిన పరిస్థితి. అలా షాక్ అవ్వడానికి కారణం నరేష్ పడేసింది ఎవరినో కాదు కొత్తగా జడ్జిగా వచ్చిన పూర్ణ. 
 
తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ప్రకారం కెవ్వుకార్తిక్‌తో పాటు స్కిట్ చేసిన నరేష్ తనకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని కార్తిక్‌కి చెబుతాడు.
 
అయితే కార్తీక్ నమ్మకపోవడంతో గర్ల్ ఫ్రెండ్ మరెవరో కాదు ఈ షోకి జడ్జిగా వచ్చిన పూర్ణ అని చెప్పి నరేష్ షాకిచ్చాడు. ఈ సందర్భంగా నరేష్ రాధేశ్యామ్‌లో ట్రైన్ సీన్ రిపీట్ చేశాడు.
 
ఆ సినిమాలో పూజా ప్లేస్‌లో పూర్ణ ఫోటో, ప్రభాస్ ప్లేస్‌లో తన ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి పెద్ద పోస్టర్ల చేయించి జబర్దస్త్ స్టేజ్ మీద ఆవిష్కరించాడు. ఈ దెబ్బకు పూర్ణ అయితే వెంటనే షాక్ కాగా మిగతా వాళ్ళు కూడా ఏంట్రా బాబు అన్నట్లు ఒక్కసారిగా స్టన్నయిపోయారు. 
 
ఇక రష్మి కూడా ఆట పట్టించేందుకు నరేష్ నువ్వు పూర్ణగారి బరువు మోస్తావా అని ప్రశ్నిస్తే మోసం మోస్తాను అని అనడంతో అందరూ సరదాగా తీసుకున్నారు. 
 
అయితే అక్కడితో ఆగకుండా మరో పోస్టర్ చూపించారు. ఈసారి పోస్టర్లో బాహుబలి2 మార్ఫింగ్ ఫోటోలు పెట్టి విల్లు ఎక్కు పెడుతున్నట్లుగా ఉన్న ఫోటోలను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.