బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 మే 2022 (13:45 IST)

మ‌హాకాళేశ్వ‌రం రాజమండ్రి దేవాల‌యం విశిష్ట‌ను వివ‌రిస్తూ న‌రేష్ చిత్రం

VK. Naresh,  Pavithra Lokesh and ohters
VK. Naresh, Pavithra Lokesh and ohters
మ‌హాకాళేశ్వ‌రం రాజమండ్రి దేవాల‌యం విశిష్ట‌ను వివ‌రిస్తూ విజ‌య‌కృష్ణ గ్రీన్ స్టూడియోస్ వారు ఒక చిత్రాన్ని డా. వీకె. న‌రేష్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌మ‌తి ప‌విత్ర లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌రించారు.
ఈ చిత్రంలో డా. వీకె. న‌రేష్‌, ప‌విత్ర లోక్ష్‌, దేవాల‌య ధ‌ర్మ‌క‌ర్త శ్రీ ప‌ట్ట‌పాగుల వెంక‌ట్రావు, శ్రీె ఎం.సి. వాసు త‌దిత‌రులు న‌టించ‌గా, శ్రీ‌శ్రీ‌పురం కిర‌ణ్ ర‌చ‌న‌లో మోహ‌న్‌రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ చేయ‌డం జ‌రిగింది.
ఈ చిత్రం ర‌వీంద్ర‌భార‌తిలో 07-05-2022 సాయంత్రం ఏడు గంట‌ల‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ కంచి కామ‌కోటి శంక‌ర విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తిగారి అమృత హ‌స్తాల‌తో మ‌రియు ఇత‌ర పీఠాధిప‌తులు, ప్ర‌జాప్ర‌తినిధులు వారి ఆధ్వ‌ర్యంలో చేయ‌డం జ‌రిగింది.
 
ఈ కార్య‌క్ర‌మం మ‌హా కాలేశ్వ‌రం యూట్యూబ్ ఛాన‌ల్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీక్షింప‌బ‌డుతుంది. ఉత్త‌ర భార‌తంలో ఉజ్జ‌యిని దేవాల‌యాన్ని అనుస‌రిస్తూ ద‌క్షిణ భార‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌మండ్రిలో గోదావ‌రి తీరాన రోట‌రీ స్వ‌చ్చంధ సంస్థ ధ‌ర్మ‌క‌ర్త‌లు శ్రీ ప‌ట్ట‌పాగుల వెంక‌ట్రావు గారి ఆధ్వ‌ర్యంలో నిర్మించ‌బ‌డింది.
ఈ దేవాల‌యంలో సుమారు ప‌ది అడుగుల శివ‌లింగంతోపాటు అమ్మ‌వారి విగ్ర‌హం ఇత‌ర దేవ‌త‌ల విగ్ర‌హాలు మ‌రియు హైద‌వ మ‌త గురువుల విగ్ర‌హాలు ద‌ర్శ‌న‌మిస్తాయి.
పై తెలిపిన పెద్ద‌ల‌తోపాటుగా సినీ న‌టులు నిర్మాత డా. వీకె. న‌రేష్‌, శ్రీ‌మ‌తి ప‌విత్ర లోకేష్‌, శ్రీ‌ద‌ర్శ‌న్‌, శ్రీ ప‌ట్ట‌పాగుల వెంక‌ట్రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.
ఈ మ‌హా కాలేశ్వ‌రం డిజిట‌ల్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఈ చిత్రంతోపాటు రోజువారీ జ‌రిగే హార‌తి, ఇత‌ర కార్య‌క్ర‌మాలు ప్ర‌క్ష‌త్య ప్ర‌సారంగా వీక్షించ‌వ‌చ్చు. అని స‌రేష్ తెలిపారు.