1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (16:37 IST)

ఘంటాడి కృష్ణ సంగీతం అందించిన లెహరాయి మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Leharayi motion poster
Leharayi motion poster
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్,గగన్ విహారి,రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీనటులుగా  రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం "లెహరాయి".ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్దమైన సందర్భంగా హైదరాబాద్‌లో సినీ అతిరదుల సమక్షంలో ఈ చిత్ర మోషన్ పోస్టర్ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు విజయ్ కుమార్ కొండా గారు చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
 
విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ..ఈ చిత్ర దర్శకుడు రామకృష్ణ గుండెజారి గల్లంతయ్యిందే.. సినిమా నుంచి నాతో ట్రావెల్ అయ్యాడు.చాలా సినిమాలకు పనిచేశాడు.తను మంచి సెన్సిబుల్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు తను చేస్తున్న ఈ సినిమాకు "లెహరాయి" అని మంచి టైటిల్ పెట్టాడు.జి.కె గారు మంచి మ్యూజిక్ ఇచ్చాడుమంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన నిర్మాత శ్రీనివాస్ గారిని సపోర్ట్ చేయడానికి బెక్కం వేణుగోపాల్ గారు సపోర్ట్ గా నిలవడం చిత్ర యూనిట్ కు శుభపరిణామం అని అన్నారు.
 
చిత్ర సమర్పకుడు బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్, రామకృష్ణలు నాకు చూపించడం జరిగింది.ఈ చిత్రం నాకు బాగా నచ్చడంతో కథకు తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేయించడంతో ఈ రోజు పర్ఫెక్ట్ మూవీని ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాం. సూపర్ హిట్ అయిన పాటను ఈ సినిమాకు టైటిల్ పెట్టడం జరిగింది.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కస్టపడ్డారు. మంచి కథతో వస్తున్న దర్శకుడు రామకృష్ణ ఫ్యూచర్ లో పెద్ద దర్శకుడు అవుతాడు అన్నారు.
 
చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..బెక్కం వేణుగోపాల్ ఆధ్వర్యంలో నేను "లెహరాయి సినిమాను నిర్మించడం జరిగింది. ఎన్నో చిత్రాలు నిర్మించిన బెక్కం వేణుగోపాల్ గారు మా "లెహరాయి" సినిమాకు సపోర్ట్ గా నిలిచారు.వారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. "లెహరాయి" అంటే అల అని అర్థం. సముద్రపు అలల్లాగా జీవితంలో ఒడిదుడుకులు కూడా ఉంటాయి. మన మోషన్ పోస్టర్ లో చూశాము. రెండు పక్షులు తమ రెక్కలు ఎగురేసుకుంటూ తమ యొక్క ప్రయాణాన్ని కోనసాగుస్తూ ఉన్నాయి. అదేవిధంగా లెహరాయి సినిమాలో కూడా హీరోయిన్   ప్రేమ 'ఒక వైపు ఉంటే గోల్ మరో వైపు ఈ రెండిటి మధ్యన ఉన్న సంఘర్షణ ను తను ఎలా ఎదుర్కిన్నదనే "లెహరాయి."మంచి కొన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా. అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర దర్శకుడు రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ.. మా టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన విజయ్ కుమార్ కొండా గారికి ధన్యవాదాలు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో మిలితమైన ఫీల్ గుడ్ లవ్ హేట్స్ లవ్ స్టొరీ అందరికీ నచ్చుతుంది అన్నారు.