సోమవారం, 4 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (21:04 IST)

జనవరి 13న నా పేరు శివ 2 విడుద‌ల‌కు సిద్ధ‌మైంది

hero Karthi
కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా `నాన్ మహాన్ అల్ల`. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో `నా పేరు శివ`గా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నా పేరు శివ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఆవారా, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు సినిమాలు స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా అభిరుచిని, ఆయన సినిమాల్లోని గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ ను చూపిస్తాయి. కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ `నా పేరు శివ 2` సినిమాను రూపొందించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రస్తుతం నా పేరు శివ 2 సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే అన‌గా జ‌న‌వ‌రి 13న నా పేరు శివ 2 సినిమా థియేటర్ లలో రిలీజ్ కానుంది.
 
నటీనటులు - కార్తి, క్యాథరీన్ థెరిసా, కలైయరాసన్ తదితరులు
 
సాంకేతిక నిపుణులు 
సంగీతం - సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ- మురళి. జి
బ్యానర్ - స్టూడియో గ్రీన్
నిర్మాత - కె ఇ జ్ఞానవేల్ రాజా
రచన దర్శకత్వం - పా రంజిత్
పీఆర్వో - జీఎస్కే మీడియా