గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (10:23 IST)

నైరుతి రుతుపవనాల ప్రభావం - నేడు, రేపు వర్షాలు

rain
తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా, ఈ రుతుపవనాల ప్రభావం కారణంగా కొన్ని చోట్ల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 
 
రాజధాని హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించింది. వచ్చే మూడు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అధికారులు మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. రహదారులపై ఎక్కడా వర్షపు నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. 
 
ఇదిలావుంటే, రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా సోమవారం ప్రవేశించాయి. దీంతో జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల  భారీ వర్షాలు కురిశాయి. జంట నగరాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది.