గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

తొలి టీ20లో చిత్తుగా ఓడిన భారత్ - రికార్డ్ బ్రేకింగ్ ఛేజింగ్

south africa team players
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓడింది. ఏడు వికెట్ల తేడాతో సఫారీలు గెలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సఫారీలు మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదించారు. ఆ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్, డస్సెన్‌లు బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఫలితంగా టీమిండియా ఓటమిని చవిచూసింది. 
 
సఫారీ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు, డస్సెన్ 46 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అత్యధిక టీ20 లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.