గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (18:54 IST)

మంత్రి నిరంజన్ రెడ్డి ఓ వీధి కుక్క : వైఎస్. షర్మిల

ys sharmila
తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డిని ఓ వీధి కుక్కతో సంబోధించారు. కుక్క మొరిగినంత మాత్రాన అబద్ధాలు నిజం కావన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వైఎస్ఆర్‌లా బతకాలని ఆమె సలహా ఇచ్చారు. 
 
ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ గురించి తెలియకుండానే మొరిగితే... అబద్ధాలు నిజం కావన్నారు. వైఎస్ మరణిస్తే 700 గుండెలు ఆగిపోయాయని విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఇకనైనా నిరంజన్ రెడ్డి సిగ్గు తెచ్చుకుని వైఎస్సార్‌లా జీవించాలని హితవు పలికారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకేకాకుండా తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని అన్నారు. పథకాల పేరు చెప్పి, మోసపూరిత హామీలను ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బంగారు తెలంగాణ అనేది కేవలం కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమేనని, తెలంగాణ ప్రజానీకానికి కాదని ఆమె వ్యాఖ్యానించారు.