శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (18:25 IST)

రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేసి వైఎస్. షర్మిల

ys sharmila
రైతు కూలీలతో కలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల వరి నాట్లు వేశారు. ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల... కొండలం నియోజకవర్గంలో తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పొలాల్లో రైతు కూలీలతో కలిసి ఆమె వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయంలో మహిళల పాత్రను ఆకాశానికెత్తేశారు. 
 
గత కొన్ని రోజులుగా ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో సాగుతోంది. ఇందులోభాగంగా గురువారం వరి మడుల్లోకి దిగిన షర్మిల.. వరి నాట్లు వేస్తూ మహిళా కూలీలతో కలిసిపోయారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "లాభనష్టాలు కాకుండా కష్టాన్ని నమ్ముకుని చేసేదే వ్యవసాయం.ఎవుసాన్ని పండగ చేయడమే మా లక్ష్యం. మహిళలు లేనిదే ఎవుసం లేదు. వారి కష్టం వెలకట్టలేనిది. నాటు వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకు సగం పనులు వారివే. ఎవుసమైనా, ఇల్లు అయినా, దేశాన్ని అయినా నడిపించడంలో వారికి వారే సాటి" అని అన్నారు.