సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (17:01 IST)

డీకే అరుణను రాజకీయంగా పైకి తెచ్చిందే వైఎస్సారే.. గుర్తుందా?

ys sharmila
'వైఎస్సార్ బిడ్డ తెలంగాణలో ఏం పని' అని డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. తాను వైఎస్సార్ బిడ్డనని, తెలంగాణ గడ్డ మీదే పెరిగానని, ఇక్కడే చదువుకోవడంతో పాటు తన బిడ్డకు కూడా జన్మనిచ్చానని తెలిపారు.

తెలంగాణ కోసం వైఎస్సార్ కుటుంబం ఏం చేసిందని అరుణ అడుగుతున్నారని.. అసలు గద్వాల్ ప్రజల కోసం మీరేం చేశారో చెప్పాలని తిరిగి ప్రశ్నించారు. అసలు డీకే అరుణను రాజకీయంగా పైకి తెచ్చిందే వైఎస్సార్ అని షర్మిల గుర్తు చేశారు. వైఎస్సార్ బిడ్డ తెలంగాణ రాజకీయాలకు రావడం అరుణకి నచ్చనట్టుందని సెటైర్ వేశారు.

డీకే అరుణ కాదు.. కేడీ అరుణ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నానని షర్మిల బదులిచ్చారు. డీకే అరుణ ఎప్పుడూ ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడింది లేదని విమర్శించారు.