గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ప్రైవేట్ వ్యవహారం : తెదేపా ఎంపీ

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్స్ వ్యవహారం ప్రైవేట్ అంశమని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. అయితే, రాజకీయ నేతలు క్లీన్‌గా ఉండాలని సూచించారు. 
 
పార్టీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కేశినేని నాని మాట్లాడుతూ... తాను అసంతృప్తిగా లేనని చెప్పారు. తనపై మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తోందని అన్నారు. 
 
తాను ఎంపీగా ఉన్నా... లేకపోయినా విజయవాడకు వచ్చిన నష్టం ఏమీ లేదని.... తన లాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారని చెప్పారు. తన ఎంపీ స్టిక్కర్ కేవలం తన కారుపై మాత్రమే ఉంటుందని... ఆ కారులో తన కూతురును కూడా తిరగనివ్వనని కేశినేని నాని తెలిపారు. 
 
ఇక వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంశం ప్రైవేట్ వ్యవహారం కాదని... అది మహిళలకు సంబంధించిన విషయమని చెప్పారు. రాజకీయ నాయకులు చాలా క్లీన్ గా ఉండాలని అన్నారు. స్వాతంత్ర్యం రావడానికి ముందు మన దేశ పరిస్థితి చాలా దారుణంగా వుండేదని... ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందిందని చెప్పారు.