అనంత ఎస్పీ పకీరప్పను గోల్డ్ మెడల్‌తో సత్కరించాలి : సీపీఐ రామకృష్ణ
హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారంలో సూపర్బ్‌గా వివరణ ఇచ్చిన అనంతపురం జిల్లా పకీరప్పను ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజున గోల్డ్ మెడల్‌తో సత్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైకాపా పెద్దల ఒత్తిడితో గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారంపై ఎస్పీ పకీరప్ప ఎటూ తేల్చలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గోరంట్ల మాధవ్ వీడియోను హోమ్ మంత్రి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెబితే.. ఎస్పీ మాత్రం పంపలేదని చెప్పి స్పష్టతనిచ్చారన్నారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మాధవ్ ఫిర్యాదు ఇచ్చారని.. కానీ తమకు ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్పీ చెప్పడం విడ్డురమన్నారు.
ఎస్పీ ఫకీరప్ప దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని విమర్శించారు. ఈ విషయంలో ఆగస్టు 15న ఆయనకు గోల్డ్ మెడల్ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.