గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (11:13 IST)

వైకాపా ఎదురుదాడి : అమ్మాయిలతో నారా లోకేష్ ఉన్న ఫోటోలు వైరల్

nara lokesh
తమ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్స్ వ్యవహారంలో చర్యలు తీసుకోలేక పోలీసులతో కథను సుఖాంతంగా ముగించిన వైకాపా పెద్దలు ఇపుడు తెలుగుదేశం పార్టీ నేతలపై ఎదురుదాడికి ఓ సైన్యాన్ని దించారు. 
 
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అమెరికాలో చదువుకునే సమయంలో విదేశీ అమ్మాయిలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. గతంలోనే బయటకొచ్చిన ఈ ఫోటోలను తాజాగా నాగార్జున యాదవ్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. పైగా, అశ్లీలతకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్ చేశారు. 
 
ప్రస్తుతం ఏపీలో ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతోంది. ఈ రచ్చలో భాగంగా, బుధవారం సాయంత్రం వైకాపా అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 
 
విదేశీ మహిళలతో మాజీ మంత్రి నారా లోకేశ్ కలిసివున్న ఫోటోలను అందులో పోస్ట్ చేశారు. దానికింద అశ్లీలతకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్స్ చేశారు. ఒకరు కాదు.. నలుగురైదుగురు మహిళతో విదేశాల్లో నారా లోకేశ్ చేసిన రాసలీలలు, శృంగార కార్యకలాపాలు బాబుకుగానీ, ఆ పార్టీ మహిళా నేతలకుగానీ అశ్లీలతంగా కనిపించడం లేదా? అని తన ట్వీట్‌లో నాగార్జున ప్రశ్నించారు. మహిళలతో లోకేశ్ విశృంఖలతో సంబంధించిన కొన్ని ఫోటోలు అవి అంటూ ఆయన పేర్కొన్నారు.