ఆ సుఖం ముణ్ణాళ్ల ముచ్చటై ఇట్టే మాయమవుతుంది
వ్యాధులు మనోవ్యధల చేత ఆరోగ్యం పాడవుతుంది. సంపదలు ఎక్కడుంటాయో ఆపదలూ ఆ పక్కనే పొంచి వుంటాయి. పుట్టినట్లి ప్రతి ప్రాణినీ మృత్యువు కబళిస్తుంది. ఇది సుస్థిరం అని చెప్పదగినట్టిది శాశ్వత నిర్మితి కలిగినట్టిది ఏదీ లేదు. సమస్తాన్నీ ఆ దైవం లయం చేసేస్తున్నాడు. కనుక అన్నింటికంటే వైరాగ్యమే అధిక సుఖదాయకం.
ఎంత ఉవ్వెత్తుగా లేస్తాయో, అంతే వేగంగా కెరటాలు తిరిగి పడిపోయినట్లే సంపదలూ విరిగి తరుగుతాయి. ఇక ప్రాణములు అనుక్షణం అనుమానాస్పదమే. మరుక్షణానికి వుంటాయో వుండవో చెప్పలేము. సరే, జవరాలితో అనుభవించే సంభోగ సుఖం ముణ్ణాళ్ల ముచ్చటై ఇట్టే మాయమవుతుంది. యవ్వనంతో పాటుగా అదీ పోతుంది.