మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (22:31 IST)

మంగళ త్రయోదశి: రుణ రోగ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే?

lord shiva - parvathi
మంగళవారంతో కూడిన త్రయోదశి రేపు (09-08-2022) వస్తోంది. సాధారణంగా మంగళవారం ప్రదోషం 'రుణ రోగ విమోచన ప్రదోషం' అంటారు. అనగా వ్యాధి, రుణ సమస్యలకు పరిష్కారం ఇచ్చేది అని అర్థం. ప్రతిరోజూ సాయంత్రం వేళ 4.30 నుండి 6 గంటల వరకు ప్రదోష కాలం అని పిలుస్తారు. అలాగే త్రయోదశి తిథి ఆ రోజు వచ్చే ప్రదోష కాలం విశేషమైనది. 
 
ఆ రోజున ప్రదోష వేళలో శివునికి, నందీశ్వరునికి నిర్వహించే అభిషేక ఆరాధనలను కన్నులపండువగా చూడటం ద్వారా రుణబాధలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు వుండవు. 
 
మంగళ ప్రదోష వేళ చంద్రుని హోరలో ఉంటుంది. ఆ వేళలో శివ స్తుతి చేస్తే, కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో కుజదోషం వున్నవారు ఈ ప్రదోష కాలంలో జరిగే పూజల్లో పాల్గొనడం మంచిది. కుజ అనుగ్రహం లభించడం వలన వ్యాధి, రుణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
కాబట్టి మంగళ త్రయోదశి తిథితో కూడి వుంటుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి.. శివపురాణం పారాయణం చేయాలి. ఉపవాసం పాటించాలి. సాయంత్రం శివాలయాలలో జరిగే అభిషేక కార్యక్రమాలలో పాల్గొనాలి. శివనామ జపం చేయాలి. పంచాక్షరీతో ఆయనను స్తుతించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.