గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (22:57 IST)

దామోదర ద్వాదశి రోజున సాలగ్రామాన్ని దానం చేస్తే? (video)

శ్రావణ శుద్ధ ఏకాదశిన ఉపవాసం చేసిన వాళ్లు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు. అలాగే ఎంతో విశిష్టతను సంతరించుకున్న సాలగ్రామాన్ని శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అందుకు కారణం శ్రావణ శుద్ధ ద్వాదశినే దామోదర ద్వాదశిగా పిలుస్తుంటారు. 
 
ఈ రోజున శ్రీమహావిష్ణువును వివిధ రకాల పూల మాలికలతో అలంకరించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి , స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. మహా విశిష్టమైన ఈ రోజున శ్రీమహా విష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీమహావిష్ణువు వెండి ప్రతిమను దానంగా ఇవ్వవచ్చు. దామోదర ద్వాదశి రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది.
 
అలాగే శ్రావణంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.