సంబంధిత వార్తలు
- ఆషాఢం అమావాస్య.. రావి చెట్టు కింద దీపం... కొత్త బట్టలు...?
- ప్రదోష వ్రతం ఎలా చేయాలి.. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి?
- బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి?-సీజనల్ వ్యాధుల నివారణకే ఈ బోనాలు..
- పంచాంగం - శనివారం, జులై 23, 2022.. ఆషాఢ కృత్తిక.. పూజ ఎలా చేయాలి?
- గురువారం నాడు కృష్ణతులసితో ఇలా చేస్తే?
శ్రావణ మాసం విశిష్టత.. ఉపవాసాలతో ఆరోగ్యం మీ సొంతం
చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ ఏడాది శ్రావణ మాసం జులై 29 నుంచి ప్రారంభమై ఆగస్టు 27 వరకు ఉంటుంది. ఈ మాసంలో తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. ఈ మాసంలో ఇల్లు పరిశుభ్రంగా ఉండకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదు.
ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తారు. ఉపవాస దీక్షలు చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి రోజూ నైవేద్యం సమర్పిస్తూ... పూజలు చేస్తారు. చాలా మంది ఈ నెలంతా మాంసం తినరు. భక్తిశ్రద్ధలతో ఇష్టదైవాన్ని కొలుచుకుంటారు.
శ్రావణమాసం ప్రతి రోజూ భక్తి శ్రద్ధలతో సాగిపోతుంది. ఉపవాస దీక్షల వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి, ఫిట్‌నెస్ పెరుగుతుంది. అందువల్ల అన్ని రకాలుగా శ్రావణమాసం మేలు చేస్తుంది. ఆయురారోగ్యాల్ని పెంచుతుంది.
శ్రావణమాసంలో తొలి సోమవారం రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసం తినకూడదు. తొలి సోమవారం రోజు విలాసాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
తర్వాతి కథనం
