ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (23:31 IST)

పంచాంగం - శనివారం, జులై 23, 2022.. ఆషాఢ కృత్తిక.. పూజ ఎలా చేయాలి?

ఆషాఢ కృత్తిక.. శుక్రవారం (Jul 22 04:25 PM – Jul 23 07:03 PM) నుంచి శనివారం వరకు వుంటుంది. ఈ రోజున ఉపవాసం విశేష ఫలితాలను ఇస్తుంది. తద్వారా, శరీర, ఆత్మలు పవిత్రంగా మారుతాయి. మనస్సు శాంతి, ఆనందాన్ని పొందుతుంది.  
 
తిథి, నక్షత్రం, వారం అనే ఈ మూడింటిలోనూ కుమార స్వామికి వ్రతాలున్నాయి. అలా వారంలో మంగళవారం ఆయనకు ప్రీతికరమైన రోజు. తిథిలలో షష్ఠి తిథి ప్రధాన వ్రతంగా చెప్పవచ్చు. నక్షత్రంలో కృత్తిక కుమార స్వామి నక్షత్రం. పరమశివుని ముక్కంటి నుంచి పుట్టిన కార్తీకేయుడు సూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. తద్వారా దేవతలను, ప్రజలను రక్షించేందుకు అవతరించిన రోజునే కృత్తిక నక్షత్రం. 
 
ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా కుమార స్వామి ఆలయాలలో, వివిధ ప్రత్యేక పూజలు, అభిషేకం, అలంకరణ, అర్చన వంటివి జరుగుతాయి. ఇంకా స్కంధ షష్ఠి కవచం పఠించడం ద్వారా కుమార స్వామి వారి పూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.