సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (12:44 IST)

కోల్‌కతాలో 21 యేళ్ల మోడల్ పూజ ఆత్మహత్య

Puja Sarkar
Puja Sarkar
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వరుసగా మోడళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో 21 యేళ్ళ మోడల్ పూజ సర్కార్ బలవన్మరణానికి పాల్పడింది. తన ప్రియుడుతో ఫోనులో మాట్లాడిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
21 యేళ్ల పూజ తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామాకు తరలించారు. 
 
కాగా, సరైన అవకాశాలు లేకపోవడం, ఆర్థిక సమస్యలు, తమ ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టడంతో అనేక మంది వర్థమాన మోడల్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు.