గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జులై 2022 (12:46 IST)

జుట్టు మొత్తం ఊడిపోతుందనీ దారుణం నిర్ణయం తీసుకున్న యువతి..

తన జట్టు మొత్తం ఊడిపోవడాన్ని ఆ యువతి జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. వెంట్రుకలు ఊడిపోకుండా ఎన్నో రకాలైన చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో ఆమె విరక్తి చెందింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.  ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు నగరంలోని రాఘవేంద్ర ఎక్స్‌టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్ళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతురాలిని కావ్యశ్రీ (21)గా గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఓ నిజాన్ని గుర్తించారు. 
 
ఆ యువతికి సోకిన వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై నజరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.