శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భర్తను అద్దెకిచ్చిన బ్రిటన్ మహిళ - రెంట్ రూ.3 వేలు

lara young - james
బ్రిటన్‌ చెందిన ఓ మహిళ కట్టుకున్న భర్తను అద్దెకు ఇచ్చింది. ఆ మహిళ పేరు లారా యంగ్. ఈమె తన భర్తను అద్దెకు ఇస్తున్నట్టు ప్రకటించారు. రెంట్ మై హ్యాండీ హస్పెండ్ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. చిన్న చిన్న పనులు చేసిపెట్టేందుకు తన భద్రతను అద్దెకు ఇస్తున్నట్టు అందులో పేర్కొంది. ఇందుకోసం రూ.3 వేల వరకు అద్దెను వసూలు చేస్తానని తెలిపింది. 
 
లారా భర్త పేరు జేమ్స్‌. ఇంటి పనుల్లో దిట్ట. చిన్నచిన్న పనులను అలవోకగా పూర్తి చేస్తాడు. పెయింటింగ్‌, అలంకరణ, టైల్స్‌, కార్పెట్లు ఏర్పాటు చేయడం వంటి పనులను నేర్పుతో చేస్తాడు. బకింగ్‌హమ్‌షైర్‌లోని తన ఇంట్లో పనికి రాని వస్తువులతో డైనింగ్‌ టేబుల్‌ తయారు చేశాడు. సొంతంగా బెడ్‌లను రూపొందిస్తున్నాడు. 
 
అందుకే అతడి నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నట్లు లారా పేర్కొన్నారు. 'టీవీని గోడకు అమర్చడం, పెయింటింగ్‌ వేయడం ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులకు 35 పౌండ్లను (సుమారు రూ.3,340) ఛార్జీలుగా వసూలు చేస్తున్నాం. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వారికి రాయితీలు కూడా ఇస్తున్నాం' అని లారా యంగ్ పేర్కొన్నారు.