శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (14:29 IST)

శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు భర్తతో రానున్న రష్మీ గౌతమ్?

Rashmi gowtham, Sudheer marriage
బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ ద్వారా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
లేటెస్ట్‌గా వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే రష్మీ కి ఇటీవలే రహస్యంగా పెళ్లి జరిగిపోయిందట. ఈ విషయం బయటకి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. 
 
అయితే పెళ్ళైన విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి అనేది ఆమె అభిమానుల్లో మెలుగుతున్న ప్రశ్న.. అయితే రష్మీ కేవలం సస్పెన్స్ మైంటైన్ చేస్తుందని.. త్వరలోనే ఆమె శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో తన భర్తతో కలిసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇంతకీ రష్మీ పెళ్లాడింది సుడిగాలి సుధీర్ నేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే రష్మీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. 
 
ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు.. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో రష్మీ కొనసాగుతుంది.