గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (13:37 IST)

2024 ఎన్నికల తర్వాత తెదేపా నేతలు దివాళా తీస్తారు: తిక్కారెడ్డి

thikka reddy
టీడీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2024 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా దివాళా తీస్తారని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా, ఈ ఎన్నికల తర్వాత అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన వద్ద ఉన్న డబ్బంతా రాజకీయాలకే ఖర్చు చేశానని చెప్పారు. 2024 ఎన్నికలు వస్తే తన ఆస్తి మొత్తం కర్పూంలా కరిగిపోతుందన్నారు. ఆ తర్వాత తాను టీకొట్టు పెట్టుకుని బతకాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ నేతలంతా ఆస్తులు అమ్ముకున్నారని తెలిపారు. 2024 ఎన్నికలు వస్తే అందరూ దివాళా తీస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇక ఆత్మహత్యలే శరణ్యమన్నారు. 
 
ఇదేసమయంలో తనపై గెలిచిన వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడు గదిలో దేవుడు ఫోటోలు తీసేసి జగన్ ఫోటోలు పెట్టుకున్నారని విమర్శించారు. అక్రమంగా ఇసుకు అమ్ముకుంటూ బస్తాలు, బస్తాలు డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎన్నికలకు వైకాపా అధిష్టానం భారీగా డబ్బులు ఇస్తుందని ఆయన చెప్పారు.