షష్ఠి రోజున కుమార స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. ఈ పుణ్యతిథి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో..షష్ఠి తిథిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు ,పువ్వులు, వెండి నాగ పడగలు, వెండి నేత్రాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ...