శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జులై 2022 (15:43 IST)

గురువారం సాయిబాబాకు నైవేద్యంగా పాలకోవాను సమర్పిస్తే..?

గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అంతేకాదు బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం కోరిన కోరికలను నెరవేరుస్తుంది. 
 
అదేవిధంగా గురువారం పూజగదిని ప్రత్యేకించి అలంకరించడం, ధూపదీపాలతో బాబాను పూజించడం చేయాలి. ధూపదీపాలతో పాలకోవాతో నైవేద్యం సమర్పించి బాబాను పూజిస్తారు. 
 
బాబాకు జీవహింస అస్సలు నచ్చదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బాబాను స్మరించుకుంటే మనకు అన్ని దోషాలు తొలగిపోతాయి.
 
గురువారం అంటే సాయినాథుడికి చాలా ఇష్టమైన రోజు…ఈ రోజు బాబాను భక్తితో కోరుకుంటే ఎలాంటికోరికలు అయినా నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. 
 
సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతోపాటు పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించి వారితో కొంతసేపు ఆనందంగా గడిపినట్లయితే బాబా కృపకు చేరవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.