గురువారం, 3 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జులై 2022 (16:02 IST)

గురువారం నాడు కృష్ణతులసితో ఇలా చేస్తే?

గురువారం నాడు కృష్ణతులసి మొక్క చుట్టూ ఏర్పడే చిన్న చిన్న మొలకలను పసుపుపచ్చని వస్త్రంలో చుట్టి, వ్యాపారస్థానంలో వుంచాలి. ఈ పని గురువారం నాడు మాత్రమే చేయాలి. ఉత్తరేణి వేరును రోగి భుజానికి కడితే భూతజ్వరం తగ్గిపోతుంది. 
 
అలాగే గురువారం, ఆదివారం నాడు ఇంట్లో గుగ్గిలంతో పొగ వెయడం ద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతికూల ఫలితాలను దూరం చేస్తుంది.
 
అలాగే గురువారం నుంచి ప్రారంభించి.. విష్ణు సహస్ర నామ స్తోత్రంను 41 రోజులు పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తం చేయించండి. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. 
 
ఒకసారి గురువారం పూట కాళహస్తి వెళ్లి రాహు, కేతు, కుజ గ్రహాలకు సర్పదోష నివారణ పూజ చేయించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.