మహారాష్ట్ర: గురువారం బలపరీక్ష.. ముంబైకి ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ గురువారంతో ముగియనుంది. రేపు బలపరీక్షకు మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్షకు డెడ్ లైన్ విధించారు. దీంతో రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది.
బలపరీక్షపై సీఎం ఉద్ధవ్‌కు గవర్నర్ కోశ్యారీ లేఖ రాశారు. అయితే గవర్నర్ నిర్ణయంపై శివసేన నేత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
బలపరీక్ష కోసం రేపు ముంబైకి వెళుతున్నామన్నారు ఏక్ నాథ్ షిండే. ఇక రోజురోజుకు ఏక్ నాథ్ షిండే మద్దతు పెరుగుతోంది. మరి కొంతమంది నేతలు షిండే క్యాంపులోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షిండే క్యాంపులో 39 శివసేన నేతలు ఉన్నారు.
కానీ శివసేనలో 19 ఎంపీలు ఉండగా వారిలో మరికొందరు షిండే క్యాంపులో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అలాగే త్వరలోనే గవర్నర్ ను కలుస్తామని షిండే కూడా ప్రకటించారు.
మరోవైపు షిండే వర్గంతో కలిసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది.