శివసేనలోని చెత్త అంతా బయటకు వెళ్లిపోయింది : ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. పార్టీలోని చెత్త అంతా బయటకు వెళ్లిపోయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మంత్రి, రెబెల్ నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో 40 మంది వరకు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వీరంతా గౌహతిలోని ఓ క్యాంపులో బస చేస్తున్నారు.
ఈ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ, అస్సాం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే అక్కడికి వెళ్లిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు లగ్జరీ హోటల్‌లో ఎంజాయ్ చేస్తున్నారన్నారు. గౌహతిలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఒక్క రోజు భోజనం ఖర్చు రూ.9 లక్షలు అవుతుందన్నారు.
అలాగే, గుజరాత్ నుంచి ప్రైవేట్ విమానాల్లో గౌహతికి చేరుకున్నందుకు వారు సిగ్గుపడాలన్నారు. పైగా, షిండేకు ముఖ్యమంత్రి పదవిని కూడా ఉద్ధవ్ ఆఫర్ చేశారని, కానీ, ఆయన తిరస్కరించారని ఆదిత్య ఠాక్రే చెప్పారు.