సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (20:07 IST)

పాత్ర న‌చ్చితే ఎక్స్‌పోజింగ్ రెడీ అంటున్న‌ రుహానీ శర్మ!

Ruhani Sharma
Ruhani Sharma
పేరున్న హీరోయిన్లే ఎక్స్ పోజింగ్‌కు సిద్ధంగా వుండ‌డంతో కొత్త‌గా వ‌చ్చేవారికి చాయిసే వుండ‌దు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు త‌ప్ప గ్లామ‌ర్ ఫీల్డులో అంద‌రూ స‌ర్దుకుపోతుంటారు. అందులో ముందుండే న‌టిగా రుహానీ శర్మను చెప్ప‌వ‌చ్చు.  హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ ప్రాంతానికి చెందిన రుహాని  2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా పంజాబీ పాట"కూడి తు పటాకా" ద్వారా పరిచయమయింది.

Ruhani Sharma
Ruhani Sharma
2017లో "కడైసి బెంచ్ కార్తీ" తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి వచ్చింది. 2018లో "చి.ల.సౌ." సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రూటు మార్చింది. తెలుగులో ఎం.ఎస్‌.రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన డర్టీ హరి సినిమాలో ఆమె పాత్ర మామూలుగా లేదు.

Ruhani Sharma
Ruhani Sharma
లిప్‌కిస్‌తోపాటు బెడ్‌రూమ్ సీన్‌లోనూ జీవించేసేది. అందులో త‌ప్పేముంద‌ని పాత్ర ప‌రిధిమేర‌కే న‌టించాన‌ని స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ త‌ర్వాత కొంత‌గేప్ తీసుకున్న రుహాని తాజాగా గోవాలో ఫొటో షూట్ చేసింది. ఇందులో యువ‌త‌ను ఆక‌ట్టుకునేరీతిలో క‌నిపించింది. ఇందులో ప్ర‌త్యేకం ఏమంటే  దిల్‌రాజు బేన‌ర్‌లో రూపొంద‌బోయే ఓ సినిమాలో యూత్ హీరో స‌ర‌స‌న ఆమె న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగానే ఆమె ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సో. మ‌రో డ‌ర్టీ హ‌రీ అవుతుందేమో చూడాలి.