బుధవారం, 13 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (18:09 IST)

క‌థ న‌చ్చితే ఎటువంటి పాత్ర‌కైనా ఓకే అంటున్న రుహానీ శర్మ

Ruhani Sharma
న‌టి రుహానీ శర్మ తెలుగులో డర్టీ హరి సినిమాతో 2020లో ప‌రిచ‌యం అయింది. ఆ సినిమాలో ఆమె చేసిన ఎక్స్‌పోజింగ్‌, లిప్ కిస్‌లు ఇంకా కుర్ర‌కారుని హుషారెత్తిస్తూనే వుంటాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ కు చెందిన రుహానీ త‌మిళం, మ‌ల‌యాళ సినిమాల్లో చేశాక తెలుగులోకి ప్ర‌వేశించింది. సినిమారంగంపై ఆస‌క్తితో మొద‌ట  2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా పంజాబీ పాట"కూడి తు పటాకా" ద్వారా పరిచయమయింది. 2017లో "కడైసి బెంచ్ కార్తీ" తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి వచ్చింది. 2018లో "చి.ల.సౌ." సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
 
కాగా, నూటొక్క జిల్లాల అందగాడు, హిట్ సినిమాల‌లో న‌టించిన ఆమె ఇటీవ‌లే ఓ సినిమాలో చేసేందుకు ఫొటో షూట్ చేసింది. హిట్ క‌థానాయ‌కుడు మ‌రో సినిమాలో ఆమెతో న‌టించ‌నున్నాడు. విశ్వ‌క్ సేన్‌తో న‌టించ‌డం త‌న‌కు చాలా అనుకూలంగా వుంటుంది స్టేట్ మెంట్ ఇచ్చింది. క‌థ న‌చ్చితే ఎటువంటి పాత్ర నైనా చేయ‌డానికి సిద్ధం అని తెలియ‌జేస్తుంది. ఇటీవ‌లే పుష్ప‌లో స‌మంత పాట చూశాన‌ని, చాలా బాగుంద‌ని తెలియ‌జేస్తుంది.