గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (15:39 IST)

అవసరాల "101 జిల్లాల అందగాడు" ట్రైలర్ రిలీజ్

అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. ఈ చిత్రం ట్రైలర్ బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో అవ‌స‌రాల శ్రీనివాస్ బ‌ట్ట‌త‌ల‌తో కనిపించే గొత్తి సత్యనారాయణగా నటిస్తున్నారు. 
 
బట్టతల క‌వ‌ర్ చేసుకోవ‌డానికి అతడు ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాడో ఆస‌క్తిగా చూపించారు. బ‌ట్ట‌త‌ల వ‌ల‌్ల హీరో కొన్ని సంద‌ర్భాల‌లో ఎమోష‌న్, ఫ్ర‌స్ట్రేట్‌ కూడా అయ్యాడు. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.
 
శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ స‌మ‌ర్పణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మించగా, ఈ మూవీ ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'చిలసౌ' మూవీ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. 
 
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ ఫస్ట్‏లుక్ పోస్టర్‏, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.