శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (20:57 IST)

ఓటీటీలో ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డర్టీ హరి'

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం డర్టీ హరి. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 18వ తేదీన ఫ్రైడే మూవీస్ ఆన్‌లైన్ ఏటీటీ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.
 
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ కి ఎక్స్‌టార్డనరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మేము  విడుదల చేసిన ఫుల్ వీడియో సాంగ్ కోటి వ్యూస్‌కి అతి సమీపం‌లో ఉంది. ఈ ట్రైలర్, ఈ సాంగ్‌తో అటు ప్రేక్షకులలోను, ఇటు పరిశ్రమలోను అనూహ్యమైన బజ్ వచ్చింది. ఈ బజ్‌కి గొప్ప విజువల్స్ ఒక కారణం కాగా, ఎం.ఎస్.రాజు డైరెక్షన్ ప్రధాన కారణం.
 
దేవి, వర్షం, ఒక్కడు , మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బాస్టర్స్ నిర్మించిన ఎం.ఎస్.రాజు దర్శకునిగా ఒక కొత్త పంధాలో ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఫస్ట్ కాపీ చూసిన 'హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్' సంస్థ అధినేతలు కేదార్ సెలగం శెట్టి, వంశీ  కారుమంచి ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమా కొనుగోలు చేసారు. 'ఫ్రైడే మూవీస్' యాప్ ఈ సినిమాతోనే ప్రారంభం కానుంది. ఈ యాప్‌లో కొంతమంది ప్రముఖులు ఇన్‌వాల్వ్ అయి ఉన్నారు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి 7997666666 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది" అని తెలిపారు.
 
దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, "నేను నిర్మాతగా చాలా జానర్‌లలో సినిమాలు తీశాను. దర్శకునిగా ఓ కొత్త జానర్ ప్రయత్నిద్దామని 'డర్టీ హరి' తీసాను. ఈ విషయంలో నాకు మంచి స్నేహితులైన గూడూరు శివరామకృష్ణ చాలా పెద్ద అండగా నిలబడ్డారు. ఎం.ఎస్.రాజు ఏంటి? ఇలాంటి సెక్స్ సినిమా తీసాడేంటని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేయడం చూసాను. దాని గురించి ఇప్పుడేం మాట్లాడను. నేనెందుకీ సినిమా తీసాను? ఇలా ఎందుకు తీసాను? అనేది ఈ నెల 18 న సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా మేకింగ్‌ని పర్సనల్‌గా ఎంజాయ్ చేస్తూ తీసాను. 
 
నా కెరీర్‌లోనే గొప్ప స్క్రీన్ ప్లే సినిమాగా నిలిచిపోతుంది. కథ విషయానికి వస్తే, ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడు. మనం రోజూ చూసే మనిషి, పైకి కనపడే మనిషి ఒక్కోసారి వేరే రకంగా కనిపిస్తారు. ఆ లోపలి మనిషి ఒక్కోసారి గాడి తప్పి ప్రవర్తించొచ్చు. ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ వల్ల చాలా పరిణామాలు సంభవిస్తాయి.
 
ఇందులో హీరో పాత్రకు ఇద్దరమ్మాయిలతో ఏర్పడిన అనుబంధం అనేక పరిణామాలకు దారి తీస్తుంది. ఈ ముగ్గురి మధ్యన జరిగే డ్రామా చాలా కొత్తగా ఉంటుంది. హీరో శ్రవణ్ రెడ్డి స్క్రీన్ మీద మేజిక్ చేసాడు. సిమ్రత్ కౌర్ తన పాత్రలో జీవించింది. రుహాని శర్మ పాత్రకి మంచి మార్కులు పడతాయి. ఖర్చుకి వెనుకాడకుండా ఈ సినిమా తీసిన నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను' అని చెప్పుకొచ్చారు. 
 
తారాగణం... శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు. 
 
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: మార్క్.కే.రాబిన్, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్, డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి, ఎడిటర్: జునైద్ సిద్ధిఖి, సమర్పణ: గూడూరు శివరామకృష్ణ, నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, రచన - దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.