గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (15:13 IST)

ఐఎండీబీలో "అల.. వైకుంఠపురమలో" రికార్డు

ప్రతి యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలో వందలాది చిత్రాలు సందడి చేసేవి. కానీ, ఈ యేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చెప్పుకోదగిన చిత్రాలేవీ విడుదల కాలేదు. అయితే, ఈ యేడాది సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో చిత్రాలు మాత్రం సూపర్ హిట్ కొట్టాయి. ఇందులో అల వైకుంఠపురములో చిత్రం మాత్రం విడుదలకు ముందు నుంచే సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. 
 
ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన రికార్డును ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఐఎండీబీ 2020లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్స్ జాబితా విడుదల చేయగా, ఇండియా నుంచి కేవలం రెండు సినిమాలు మాత్రం అందులో చోటు సంపాదించుకున్నాయి. 
 
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురంలో' టాప్ 20లో నిలవడంతో హర్షం వ్యక్తం చేసిన మూవీ మేకర్స్.. ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రికార్డును తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్‌ మూవీ 'భాగీ 3' కూడా ఈ జాబితాలో నిలిచింది. 'అల వైకుంఠపురములో' సృష్టిస్తున్న రికార్డులతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.