గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (17:15 IST)

#AlaVaikunthapurramuloo కొత్త రికార్డ్.. ఏంటదో తెలుసా?

అల వైకుంఠపురములో సినిమా పాటల్లో ఒకటైన బుట్టబొమ్మ బంపర్ హిట్ కావడంతో పాటు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఖాతాలో కొత్త రికార్డు చేరింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా ఈ ఏడాది విడుదలైన ఈ సినిమా ఈ ఏడాది భారీ హిట్ అందుకున్న సినిమాగా ఇది రికార్డకెక్కింది. అయితే ఇటీవల ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. 
 
సినిమా విడుదలై ఎంత బాగుందనే విషయాన్ని రేటింగుల ద్వారా ఇచ్చే ఐఎండీబీ సంస్థ లిస్టులో చోటు దక్కించుకుంది. ఇప్పటివరకు అత్యధికంగా చూసిన సినిమా ట్రైలర్లలో 20వ స్థానానంలో నిలిచింది. దేశంలోని అన్ని భాషల సినిమాలతో పోటీ పడుతూ టాప్-20లో స్థానం దక్కించుకుంది. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించింది. 
 
ఈ సినిమాతోనే అభిమానులు పూజాకు బుట్టబొమ్మగా పేరు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 2020 జనవరీ 12న విడుదలయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.262 కోట్లు సంపాదించింది.