గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (18:40 IST)

సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్

నేడు ప్రసార మాధ్యమాలు ఎంత వేగంగా దూసుకెళ్తున్నాయో అందరీ తెలిసిన విషయమే. ఈ వేళ సోషల్ మీడియా అనేది అందరికీ సాధారణమైపోయింది. సోషల్ మీడియాలో అకౌంట్ లేనివారు చాలా తక్కువని చెప్పవచ్చు. అంతలా ఈ సామాజిక మాధ్యమాలు బహుల వ్యాప్తిలో కి వచ్చాయి.
 
ఇక సినిమా వాళ్ల విషయంలో వేరే చెప్పక్కర్లేదు. వీటిని చక్కగా వినియోగించే వాళ్లల్లో సినీ తారలు ముందుంటారు. తమ కొత్త చిత్రాల విశేషాలను, షూటింగ్ కబుర్లను, తమ వ్యక్తిగత వివరాలను ఫోటోలతో సహా పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ ట్విట్టర్లో తాజాగా ఓ రికార్డ్ సృష్టించారు.
 
అతి తక్కువ కాలంలో పది లక్షల ఫాలోవర్లను సాధించిన టాలీవుడ్ స్టార్‌గా రామ్ చరణ్ రికార్డ్ కొట్టారు. ఈ ఏడాది మార్చిలో తన ట్విట్టర్ ఖాతాను మొదలు పెట్టిన రామ్ చరణ్ 233 రోజుల్లో 10 లక్షల మంది ఫాలోవర్లను తమ సొంతం చేసుకున్నారు. ఇంత వేగంగా ఈ మార్కును సాధించినవారు టాలీవుడ్లో ఎవరూ లేరని అంటున్నారు. మెగా ఫ్యామిలీ ఇమేజ్‌కి ఇదొక ఉదాహరణగా చెబుతున్నారు.