సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (14:02 IST)

టాలీవుడ్‌కి గుడ్ న్యూస్. ఇంతకీ ఏంటది..?

కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు థియేటర్లు మూతపడే ఉన్నాయి కానీ.. ఓపెన్ కాలేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... థియేటర్లు ఓపెన్ కాలేదు. అయితే... రీసెంట్‌గా సీఎం కేసీఆర్‌ను చిరంజీవి, నాగార్జున కలిసారు. అప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు.. వాటిని ఎలా పరిష్కరించాలి అనేది చర్చకు వచ్చినట్టు సమాచారం. వరద బాధితుల కోసం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు వారు సీఎంను కలిశారు. 
 
ఈ సందర్భంగా థియేటర్ల ప్రస్తావన వచ్చింది. అయితే... కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. సినిమా షూటింగులు అలాగే సినిమా థియేటర్లు పునఃప్రారంభించుకోవచ్చని సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. మార్చి 23 నుంచి థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నది. 
 
మరోవైపు ఈ రంగంపై ఆధారపడిన ఎందరో టెక్నిషియన్లు సిబ్బంది జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడం లాక్డౌన్ నిబంధనలతో పెద్దగా షూటింగ్లు జరగడం లేదు. అయితే... త్వరలోనే ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయనున్నట్టు సీఎం చెప్పారు. ఇది టాలీవుడ్‌కి గుడ్ న్యూస్. మరి.. త్వరలోనే థియేటర్లు ఓపెన్ అవుతాయని... థియేర్లకు పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం.