బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (22:58 IST)

శ్రావణ తదియ: ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలట..

శ్రావణ తదియ రోజున మహిళలు ఐదుగురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి.  ముత్తైదువులకు వాయనం ఇచ్చేవారు గోరింటాకు పెట్టుకొనవలెను. 
 
బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. ఇలా చేస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
సమస్త శుభాలు చేకూరుతాయి. ఆ రోజున అమ్మవారికి బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టాలి.
  
అలాగే వంటల్లో నైవేద్యంగా సమర్పించే వంటకాల్లో గోంగూర, నువ్వుల పొడి చేర్చుకోవాలి. ఇలా చేస్తే శ్రావణ మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు, దగ్గు మొదలగునవి దరిచేరవు.