శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (13:17 IST)

ఏ ముఖం పెట్టుకుని తీసుకెళతాం, మా పరువు తీసింది: విశాఖ మిస్సింగ్ యువతిపై పేరెంట్స్

saipriya
తన పెళ్లి రోజున తన ప్రియుడితో కలిసి పారిపోయిన విశాఖకు చెందిన వివాహిత సాయిప్రియ, ఆమె ప్రియుడు రవిలు సమాజానికి, భర్తకు, పోలీసులకు క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,

 
తమ పెళ్లి రోజున కట్టుకున్న భర్తతో విశాఖ ఆర్.కె. బీచ్‌కు వెళ్లిన సాయిప్రియ.. అక్కడ నుంచి తన ప్రియుడితో కలిసి బెంగుళూరుకు వెళ్లి.. అక్కడ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. శుక్రవారం తన ప్రియుడు రవితో కలిసి విశాఖపట్టణం తిరిగి వచ్చింది. 

 
నిజానికి సాయిప్రియ 4 రోజుల క్రితం విశాఖ సముద్రంలో గల్లంతైందని భావించి రూ.కోటి ఖర్చుతో సముద్ర తీరాన్ని హెలికాఫ్టర్లతో జల్లెడ పట్టారు. ఆ తర్వాత ఆమె తాను ప్రేమించిన రవితో కలిసి బెంగుళూరులో ఉన్నట్టు తేలింది. ఇష్టపూర్వకంగానే రవితే కలిసి వచ్చినట్టు తెలిపింది. 

 
తాము ప్రేమించుకున్న విషయం తన తండ్రి ఫోన్‌కు వాయిస్ మెసేజ్ పంపినట్టు తెలిపింది. అయితే, ఆమె అదృశ్యమైన రోజే పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారు ఏం చేయాలన్న విషయంపై పోలీసులు ఆలోచనలో పడ్డారు. 

 
ఈ క్రమంలోనే సాయిప్రియ, రవి శుక్రవారం సాయంత్రం విశాఖపట్ణణానికి వచ్చేశారు. వారు ఎన్.ఏ.డి కూడలిలో వారింటి పరిధిలోకి వచ్చి ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని కోరారు. 

 
దీంతో పోలీసులు వారిద్దరినీ ఒకే గదిలో ఉంచి వారి పెద్దలకు సమాచారం ఇచ్చారు. సాయిప్రియ తరపున బంధువులు మాత్రమే వచ్చారు. రవి తరపున ఒక్కరు కూడా రాలేదు. ఆ గదిలో వారంతా కొంతసేవు ఘర్షణ పడ్డారు. అక్కడ ఏం జరిగిందన్న అంశంపై పోలీసులు బయటకు వెళ్లడించారు. 

 
పైగా, వారిచ్చిన స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఆ తర్వాత మీడియా అక్కడకు వెళ్లిపోయింది. అపుడు సాయిప్రియ స్పృహతప్పి పడిపోయింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో వారిని పోలీసులు బయటకు పంపించివేశారు. ఆ సమయంలో మీడియా సాయిప్రియను, రవిని ప్రశ్నించగా, ప్రభుత్వానికి, సమాజానికి, పోలీసులకు, తమ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. 

 
తన భర్తను కూడా ఆమె క్షమాపణలు కోరింది. తాము పెద్దల వద్దకు వెళ్లబోమని, స్వతంత్రంగానే వేరుగా ఉంటామని, ఇంతకు మించి ప్రశ్నలు వేయొద్దని వారు మీడియాను ప్రాధేయపడ్డారు. సాయిప్రియ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించింది. 

కాగా అంతకుముందు సాయిప్రియ-రవిని ఇంటికి తీసుకుని వెళ్లాలని పలువురు సూచించగా... మా బిడ్డలు తల దించుకునే పని చేసారనీ, ఏ ముఖం పెట్టుకుని తీసుకుని వెళ్తాం అంటూ వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.