బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (17:26 IST)

నదిలో ప్రవహిస్తున్న నీళ్లను చూసి హిస్టీరియా వచ్చిందో ఏమోగానీ దూకేశాడు... గల్లంతయ్యాడు

కొంతమంది మానసిక స్థితి చాలా సున్నితంగా వుంటుంది. ఇట్లాంటి వాళ్లు కొండ శిఖరాలు, రైలు పట్టాలు, లోయలు, ప్రవహిస్తున్న నీటిని చూస్తే మనసు గతి తప్పుతుందని చెపుతున్నారు. ఆ పరిస్థితిలో వాళ్లు ఏం చేస్తారో వారికే తెలియదనీ, వారి మనసు బలహీనపడి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం వుంటుందని చెపుతున్నారు. అలాంటి విషాదర ఘటన జరిగింది.

 
ఐతే ఇక్కడ ఓ యువకుడు నదీ ప్రవాహాన్ని చూస్తూ చూస్తూ ఒక్కసారిగా నదిలోకి దూకేసాడు. అంతే... నీటిప్రవాహంలో ఏమయ్యాడో కూడా ఆచూకి చిక్కలేదు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మహారాష్ట్ర మాలేగావ్‌లో భారీ వర్షం కారణంగా గిర్ణా నది ప్రవాహం ఉధృతంగా వుంది. నదీ ప్రవాహాన్ని చూసేందుకు పలువురు అక్కడికి వచ్చారు. వారితో పాటు 23 ఏళ్ల బిత్తిరి అనే యువకుడు కూడా వచ్చాడు.

 
నదీ ప్రవాహాన్ని చూస్తూ చూస్తూ అకస్మాత్తుగా నదిలో దూకేసాడు. అతడు అలా ఎందుకు దూకేశాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. చేష్టలుడిగి చూస్తుండిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లు గాలించినప్పటికీ అతడి ఆచూకి లభించలేదు. యువకుడు అలా ఎందుకు ప్రవర్తించాడన్నది సస్పెన్సుగా మారింది. ఐతే కొందరు అతడు నదీ ప్రవాహాన్ని చూసి మానసిక స్థితి చలించి అలా చేసివుంటాడని అంటున్నారు.