1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (11:03 IST)

పొట్ట పెరిగింది. కానీ తగ్గలేదు.. కడుపులో 35 కిలోల గడ్డను తొలగించారు..

operation
పొట్ట పెరిగింది. కానీ తగ్గలేదు. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగింది.  ఫలితం లేదు. చివరికి ఈ నెల 16న రుయా అనుబంధ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. డాక్టర్‌ మాధవి ఠాగూర్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం పరీక్షించి అండాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. 
 
భారంగా మారిపోతున్న కడుపులో ఉన్న గడ్డను ఆపరేషన్ చేసి తొలగించాలని చెప్పడంతో తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి చేరింది బాధితురాలు. ఈ మేరకు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. 46 ఏళ్ల నాగమ్మ అనే మహిళ కడుపులోని 35 కిలోల గడ్డను తొలగించిన వైద్యులు ఆపరేషన్ సక్సెస్ చేశారు.
 
మోయలేనంత బరువుఉన్న గడ్డ కడుపులో ఉండటంతో నడవడం కూడా సాధ్యం కాక, గత కొంతకాలంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగింది నాగమ్మ. 
 
నాగమ్మ స్వస్థలం సూళ్లూరుపేట మండలం మన్నారు కోటూరు గ్రామం. కాగా, 46 ఏళ్ల నాగమ్మను పరీక్షించి క్లిష్టమైన ఆపరేషన్ పూర్తి చేసారు వైద్యులు. గంట వ్యవధిలో కడుపులోని 35 కిలోల గడ్డను తొలగించారు. ప్రస్తుతం నాగమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని వైద్యులు చెప్పారు.