సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (15:54 IST)

వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రానికి పట్టిన వైరస్.. చంద్రబాబు

chandrababu
వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రానికి పట్టిన వైరస్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అని ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దినదినగండంగా మారుతున్నదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సీఎం వైఎస్ జగన్ పాలనతో ఇప్పటికే ప్రజలు పూర్తిగా విసిగి పోయారన్నారు. ప్రతినిత్యం రాష్ట్రంలో వేధింపులు, కబ్జాలు, ఆత్మహత్యలు, కేసులు, కూల్చివేతలు నిత్యకృత్యం అయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఉపాధి కోల్పోతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలతో చాలా మంది జీవితాలను కోల్పోతున్నారని వాపోయారు. బాధల్లో ఉన్న ప్రజానీకానికి ధైర్యం, నమ్మకం కలిగించాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు హితవు చెప్పారు.