గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆంధ్రా మరో శ్రీలంక కాకతప్పదా? 7 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు అప్పు

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకునిపోతోంది. అందుబాటులో ఉన్న ప్రతి చోటా అప్పులు తీసుకుంటుంది. ఈ విషయంపై ఇప్పటికే విపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా 7 శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లను అప్పుగా తీసుకుంది. ఇందులో 7.72 శాతం వడ్డీతో రూ.500 కోట్లు, మరో రూ.500 కోట్లను 7.74 శాతం వడ్డీకి భారత రిజర్వు బ్యాంకు నుంచి అప్పుగా తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏకంగా రూ.34,980 కోట్ల రుణం తీసుకుంది. 
 
వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రూ.43,803 కోట్ల మేరకు బహిరంగ రుణాన్ని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే కేవలం నాలుగున్నర నెలలోనే ఏకంగా రూ.34 వేల కోట్లకుపైగా ఏపీ రుణం తీసుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే ఏపీ రాష్ట్రం కూడా మరో శ్రీలంక కాకతప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.