బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified సోమవారం, 12 సెప్టెంబరు 2022 (21:24 IST)

ఎవడ్రా అడిగేది నన్ను? ఈ నా తెలంగాణాలోనే వుంట: వైఎస్ షర్మిల

YS Sharmila
వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తను తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని కొంతమంది అంటున్న వ్యాఖ్యలను ఖండించారు.

 
ఆమె మాట్లాడుతూ... ''నేను ఇక్కడ పెరిగిన.. ఇక్కడ చదువుకున్న.. ఇక్కడ పెండ్లి చేసుకున్న.. నా బతుకు ఇక్కడే.. నా భవిష్యత్తు ఇక్కడే.. అలాంటప్పుడు ఇది నా తెలంగాణ కాకుండా ఎట్లవుతది? ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా బాధ్యత కాదా? ఎవడ్రా అడిగేది నన్ను?'' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.